ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: పొలాస నరేందర్

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలి: పొలాస నరేందర్ వేములవాడ, తెలంగాణ అడ్డా: శ్రీ గణేష్ నవరాత్రుల సందర్భంగా వేములవాడలోని శ్రీ శ్రీ శ్రీమధ్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో విఘ్నేశ్వరుడిని మాజీ సర్పంచ్, ధర్మకర్త, సెస్ డైరెక్టర్, బీసీ నేత పొలాస నరేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. తొమ్మిది రోజులుగా భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకున్నారని తెలిపారు. కుంకుమ పూజలు, అన్నదానాలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకున్నారని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, నిమజ్జన ప్రదేశాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు, విద్యుత్, మున్సిపల్, ఆలయ సిబ్బంది...