దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ​దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారితో వెంటనే చర్చించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి సూచించారు. ​సమావేశంలోని ముఖ్యాంశాలు: ​విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...