ఈ నెల 30న కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం.. ఏర్పాట్లను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్ల పరిశీలన: ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాంతాల పరిశీలన: ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణంతో పాటు జిల్లా కలెక్టర్ ఛాంబర్, ముఖ్యమంత్రి పర్యటించే...