క్రాప్ బుకింగ్‌లో వేగం పెంచాలి.. జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్‌లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. క్రాప్ బుకింగ్, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా కలెక్టర్.. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పీఏసీఎస్ సెక్రటరీలు, అసిస్టెంట్ రిజిస్టార్లు, మార్క్‌ఫెడ్ అధికారులతో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు: క్రాప్ బుకింగ్ పూర్తి: జిల్లాలో ఇప్పటివరకు 56 శాతం క్రాప్ బుకింగ్ పూర్తి అయిందని, మిగతా బుకింగ్‌ను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎరువుల కొరత...