కరీంనగర్లో ప్రశాంతంగా, వైభవంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మరియు గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ముగిశాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహా ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దిగ్విజయంగా పూర్తి కావడానికి నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు అందించిన నిరంతర సహకారం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యవేక్షణ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ఏర్పాట్లు పూర్తి...