రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అల్లూరి సీతారామరాజు జిల్లా డీఆర్వో
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో - ఎఫ్ఏసీ)గా విధులు నిర్వహిస్తున్న ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తన సొంత కార్యాలయంలోనే లంచం సొమ్ము తీసుకుంటుండగా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సహోద్యోగి నుంచే డిమాండ్: కలెక్టరేట్ కార్యాలయంలోనే పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్‌కు సంబంధించిన జీతభత్యాల బకాయిలు, బిల్లుల ఫైల్‌ను క్లియర్ చేయడానికి డీఆర్వో లోకేశ్వరరావు రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తాన్ని...