కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత వరాల నర్సింగంకు ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుందా?ప్రతిపక్షం పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు.. కరీంనగర్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఫ్లోర్ లీడర్ కార్పొరేషన్ పీఠం!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఎస్యూఐ (NSUI) విద్యార్థి దశ నుంచి నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, సుమారు నాలుగు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న సీనియర్ నాయకుడు వరాల నర్సింగంకు ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వరాల నర్సింగంకు ఉన్న బలమైన అర్హతలు: గతంలో డిప్యూటీ మేయర్ భర్తపై 21వ డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన కార్పొరేటర్ వరాల నర్సింగం, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు....