వంట గ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసీ అలర్ట్. ఈ నెలాఖరు వరకే గడువు
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఎల్పీజీ వినియోగదారుల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండగా, హైదరాబాద్ మహానగరం పరిధిలో ఇంకా 12 శాతం మంది వినియోగదారులు పూర్తి చేసుకోలేదు. ఈకేవైసీ పూర్తి చేసుకోని లబ్ధిదారులకు అక్టోబర్ 01 నుంచి 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఉండబోదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువు ముగింపు - ఆందోళన: ఈకేవైసీని సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేయడంతో, ఇప్పటికీ చేయించుకోని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద నిత్యం విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. సాధారణ ఎల్పీజీ వినియోగదారులతో పాటు మహాలక్ష్మి, దీపం...