ఆయిల్ పామ్ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు మళ్లించాలని సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. పంటను ప్రోత్సహిస్తూ.. ధరలను దెబ్బతీస్తున్నారు: “రైతును ఆయిల్ పామ్ సాగు చేయమని ప్రోత్సహిస్తారు.. కానీ రైతు పండించిన గెలలకు గిట్టుబాటు ధర వచ్చే...