కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆకుల ఉదయ్ నియామకం కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆకుల ఉదయ్ నియమితులయ్యారు.

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఈ మేరకు అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ శుక్రవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ అర్బన్ డీసీసీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. నేతల అందరికీ కృతజ్ఞతలు: తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్‌లకు ఉదయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి: ఈ సందర్భంగా ఆకుల...