కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. సెప్టెంబర్ 30న నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఓటు చోరీ నిరసనగా ఈనెల 28న కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎస్ఐఆర్ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని డిమాండ్
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి మరియు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 30న విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా భవన్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్,...