ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మొదటినుంచీ రాజీలేని పోరాటం మాదే సీఎన్జీవోస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌రెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మొదటినుంచీ రాజీలేని పోరాటం చేస్తోంది తమ జేఏసీయేనని సీఎన్జీవోస్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సహకారంతోనే ఉద్యోగుల హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హామీతోనే తాత్కాలిక విరమణ: ప్రస్తుతం ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోయినా, ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతోనే తాత్కాలికంగా ఆందోళనలు విరమించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దసరాకు రెండు డీఏలు, సంక్రాంతికి మరో డీఏ ఇస్తామని సీఎం నుంచి హామీ లభించిందని తెలిపారు. పీఆర్సీ కమిటీ నియామకం, పెండింగ్ బిల్లుల...