తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు ప్రదానం కేరళ రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కేరళ బ్యూరో / తెలంగాణ అడ్డా: ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డును అందుకున్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎంపీ శ్రీ కేసీ వేణుగోపాల్ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కేరళ వెలుపల నుంచి ఎంపికైన తొలి వ్యక్తి: ఆర్యదాన్ ముహమ్మద్ గారి జ్ఞాపకార్థం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు కేరళ రాష్ట్రం వెలుపల నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి నిలవడం విశేషం. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలు మరియు ఆయన విశేష నాయకత్వ ప్రతిభను పరిగణనలోకి...