విలాసాగర్ చెరువులోకి నీరు బీఆర్ఎస్ నిరసనతో అధికారులు నీటిని విడుదల చేశారన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
విలాసాగర్ చెరువులోకి నీరు బీఆర్ఎస్ నిరసనతో అధికారులు నీటిని విడుదల చేశారన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బోయినీపల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి చొప్పదండి నియోజకవర్గం బోయినీపల్లి మండలం మర్లపేట గ్రామ పరిధిలోని వరద కాలువ నుంచి విలాసాగర్ చెరువును నింపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విలాసాగర్ గ్రామ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి విలాసాగర్ చెరువును నింపేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. అనంతరం అధికారులు నీటిని విడుదల చేయడంతో విలాసాగర్ చెరువులోకి నీరు చేరింది. చెరువులోకి నీరు రావడంతో...