విబేధాలు వీడి సమన్వయంతో పనిచేయాలి.. ఆర్భాటపు పనులొద్దు: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. గ్రామాల అభివృద్ధే సర్పంచుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజీవ్ మల్హోత్ర అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఆర్థిక భారం పడేలా ఆర్భాటాలు వద్దు: పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే ముందు ఆయా పంచాయతీల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కేవలం హంగులు, ఆర్భాటాల కోసం పనులు చేపట్టి భవిష్యత్తులో...