సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ఈ నెల 30వ తేదీన బుధవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో, అధికారులు అందరూ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ, చేనేత జౌళి శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలకగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు....