జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ పోటీలలో ప్రతిభ చాటిన అల్ఫోర్స్ విద్యార్థిని.. రాష్ట్రస్థాయికి ఎంపిక!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: విద్యార్థులు తప్పనిసరిగా వివిధ రకాల పోటీ పరీక్షలలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని, తద్వారా వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్కు చెందిన విద్యార్థిని జిల్లాస్థాయి సైన్స్ సెమినార్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అన్ని విషయాలపై సమగ్ర పరిజ్ఞానం అందిస్తున్నామని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా వివిధ స్థాయిలలో శిక్షణ ఇప్పిస్తూ అగ్రగామిగా నిలుపుతున్నామని తెలిపారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సైన్స్...