ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్య, విద్యా రంగాలు: ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలు అభివృద్ధి చెందుతున్నాయని, పేద ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతగానో ఊరట కల్పిస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ మరియు కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. భారీగా చెక్కుల పంపిణీ: పెద్దపల్లి నియోజకవర్గంలోని 367 మంది లబ్ధిదారులకు రూ.1,65,94,650 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను, అలాగే పెద్దపల్లి మండలం మరియు పట్టణానికి చెందిన 91 మంది లబ్ధిదారులకు రూ.91,10,556 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ...