వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు..
వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ - మన రజక కుటుంబాల ఐక్యవేదికమణుగూరు. తెలంగాణ అడ్డా ( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). పినపాక నియోజకవర్గం మణుగూ రు ఎంట్రెన్స్ అభయాంజ నేయ దేవాలయం వద్ద నిర్మించిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మన రజక కుటుంబాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ. రాజ్యాంగం ప్రకారం ఒకే న్యాయం, ఒకే చట్టం అని చెబుతున్నా, రజకుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతున్నారని...