ఓటు హక్కుపై రాజీ లేదు.. ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఓటు హక్కు, ఎన్నికల పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన కీలక అంశాలపై హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం పార్టీల వామపక్షాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీజేఎస్ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రస్తుత Special Intensive Revision (SIR) ప్రక్రియపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థపై ప్రజలకు, రాజకీయ పార్టీలకు సంపూర్ణ విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమని అన్నారు. ఈసీఐలో డిసెంట్ నోట్స్ (Dissent Notes)...