డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారం అందించాలి: కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సముచితమైన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి స్మారక పార్క్‌ను, ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి...