విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నాం: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డ: బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పరిపాలన చేతకానిదని, ఇది పూర్తిగా ఫెయిల్యూర్ సర్కార్ అని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వైద్య, విద్య రంగాలు సంక్షోభంలో పడ్డాయని ఆరోపించారు. పసిపిల్లల మరణాలపై ఆందోళన: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో ఏటా వేలాది మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమని, రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటివరకు వేలాది మంది పిల్లలు చనిపోయినట్లు ఓ...