కరీంనగర్లో రౌడీయిజానికి చోటు లేదు. దళిత నాయకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జెర్రిపోతుల వాసుపై బీజేపీ నాయకులు భౌతిక దాడికి పాల్పడటాన్ని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మాజీ తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మల్యాల సుజిత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, శాంతిభద్రతలను కాపాడాలని కోరుతూ పలువురు జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన నగర ఏసీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. పేద దళితుడిపై దాడి దుర్మార్గం: ఈ సందర్భంగా మల్యాల సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. జెర్రిపోతుల వాసు సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అని, అంబేద్కర్ సంఘాల్లో చురుగ్గా ఉంటూ సేవ...