సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూరు ప్రతినిధి / తెలంగాణ అడ్డా: సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంచాయతీ వ్యవస్థ బలోపేతం: గత బీఆర్‌ఎస్‌ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోందని, గ్రామాల అవసరాలకు అనుగుణంగా...