ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవకు నిదర్శనం 'సేవా సంకల్ప్ అభియాన్'.. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా (బీజేపీవైఎం) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానమే అత్యంత పవిత్రమైనది: ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు శ్రమిస్తూ, 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ...