సుడా పగ్గాలు వి. నరేందర్ రెడ్డికి దక్కనున్నాయా? కరీంనగర్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

సుడా పగ్గాలు వి. నరేందర్ రెడ్డికి దక్కనున్నాయా? కరీంనగర్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందనే అంశంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, వీఎన్‌ఆర్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉన్న అనుబంధం, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సుడా చైర్మన్ పదవికి ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే...