బోయినిపల్లి లో నవీన హాస్పిటల్ నూతన క్లినిక్ ప్రారంభం
తెలంగాణ అడ్డా బోయినిపల్లీ ప్రతినిధి: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక, అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 'నవీన హాస్పిటల్' సౌజన్యంతో ఏర్పాటు చేసిన నూతన క్లినిక్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. పాత సెస్ (CESS) కార్యాలయ ప్రాంగణంలోని నూతన షట్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ (MBBS, DA), మాట్లాడుతూ.. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సాధారణ అనారోగ్యం మొదలుకొని అత్యవసర వైద్య సేవల కోసం పట్టణాలకు, సుదూర ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోందని, దీంతో...