నగరపాలక సంస్థలో ప్రైవేట్ వ్యక్తుల చేతికి చేయూత పెన్షన్ డేటా ఎంట్రీ.. ఆధార్ ఒకరిది.. పేరు మరొకరిది.. ప్రభుత్వ గోప్యతకు తూట్లు, లబ్ధిదారుల ఆందోళన!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: కరీంనగర్ నగరపాలక సంస్థలో పౌర సేవల నిర్వహణ గాడి తప్పుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైన 'చేయూత పెన్షన్' ఆన్‌లైన్ ఎంట్రీ బాధ్యతలను ప్రభుత్వ సిబ్బందిని విడనాడి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక రికార్డులు, ప్రజల వ్యక్తిగత సమాచారం (డేటా) ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఆధార్ ఒకరిది.. పేరు మరొకరిది.. తీవ్ర తప్పిదాలు: పెన్షన్ దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదులో తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడుతోంది. ఏకంగా ఆధార్ నంబర్ ఒక వ్యక్తిదిగా ఉంటే, పేరు మరో వ్యక్తిదిగా నమోదు అవుతున్న ఉదంతాలు...