తెలంగాణ యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టి కృషి హైదరాబాద్: తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ (TYNCA) సమావేశం సికింద్రాబాద్ వైఎంసీలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది కమలారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ

హైదరాబాద్ తెలంగాణ అడ్డా బ్యూరో: తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ (TYNCA) సమావేశం సికింద్రాబాద్ వైఎంసీలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది కమలారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం TYNCA ఆధ్వర్యంలో సమిష్టిగా ఉద్యమిస్తామని తెలిపారు. అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి యూట్యూబ్ జర్నలిస్టును ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన సహకారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గౌరవ అధ్యక్షుడు జయ గణేష్, ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ పులకంటి, కార్యదర్శి నరేందర్, ట్రెజరర్ శ్రీనివాస్ రాంటెంకి, సహాయ కార్యదర్శి...