రాజన్న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ.సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ప్రముఖ నాయకులు!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపు జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు మరియు ప్రముఖ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన వసతులు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ మరియు ఇతర భద్రతా చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో పాల్గొన్న ప్రముఖులు: ఈ పరిశీలన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్‌లు శ్రీ ఆది శ్రీనివాస్ (విజయ...