కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ స్పందిస్తారా? నిబంధనలకు విరుద్ధంగా, ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘించి ఫ్లెక్సీలు కట్టిన వారిపై జరిమానాలు విధిస్తారా లేక తొలగిస్తారా? అధికారుల చర్యలపై వేచి చూస్తున్న ప్రజలు!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణం ప్రారంభోత్సవం తదితర అధికారిక కార్యక్రమాల పేరుతో నగరంలో నిబంధనలను గాలికొదిలి ఇష్టారాజ్యంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా రోడ్లకు అడ్డంగా, ప్రధాన కూడళ్లలో భారీ సైజుల్లో ఫ్లెక్సీలు కట్టడం వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్లలోనూ అదే పరిస్థితి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పేరుతోనూ సరిగ్గా ఇదే తరహాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ మరియు సిరిసిల్ల ప్రాంతాల్లో అనధికారికంగా...