రేపు కరీంనగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు రేపు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ముమ్మర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సభకు, ప్రారంభోత్సవానికి విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, భద్రతా చర్యలపై తగిన సూచనలు చేయడం జరిగింది. రేపటి పర్యటన ముఖ్య కార్యక్రమాలు: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ:...