అభివృద్ధి కోసం నిధులతో వస్తే స్వాగతిస్తాం కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత జక్కుల నాగరాజు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, తంగళ్లపల్లి మండల ప్రజల తరఫున పలు కీలక డిమాండ్లను బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత జక్కుల నాగరాజు తెరపైకి తెచ్చారు. సిరిసిల్లకు అభివృద్ధి నిధులతో వస్తే స్వాగతిస్తామని, అంతేకానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధే గీత: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా కేటీఆర్ ప్రాతినిధ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన సర్వతోముఖాభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించాలని నాగరాజు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా...