చాకలివానిపల్లి సర్పంచ్ రేపాక బాణవ్వ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న సర్పంచ్.

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామ సర్పంచ్ రేపాక బాణవ్వ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆమెను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతిని, సంక్షేమాన్ని ధ్యేయంగా చేసుకొని ముందుకు వెళ్తోందని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలంటే ప్రజాప్రతినిధులు,...