కొంగరకుర్దు భూముల కబ్జాపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలదే భూమాఫియా

రంగారెడ్డి జిల్లా బ్యూరో / తెలంగాణ అడ్డ రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు-ఏ గ్రామ భూ బాధితులతో కలిసి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి రూ. 5 వేల కోట్ల విలువైన వక్ఫ్ భూములను కబ్జా చేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంగరకుర్దు భూములను వెంటనే రక్షించాలని, రైతులకే ఆ భూములు దక్కాలని ఆమె డిమాండ్ చేశారు. భూ మాఫియా చెరలో 150 ఎకరాల వక్ఫ్ భూమి: తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆర్కనైజ్డ్‌గా భూ మాఫియా పెద్ద ఎత్తున భూములు కబ్జా చేస్తోందని కవిత ఆరోపించారు. కొంగరకుర్దులోని సర్వే నంబర్లు 2 నుంచి...