కరీంనగర్ కైవసం కాంగ్రెస్కు సాధ్యమేనా? లక్ష మైనారిటీ ఓట్లు ఉన్నా బలహీనపడుతున్న క్యాడర్!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: రాబోయే రోజుల్లో కరీంనగర్ సీటుతో పాటు సిరిసిల్ల సీటును కూడా కైవసం చేసుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ధీమా వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలను పరిశీలిస్తే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ మరియు పార్టీలో వారి ప్రాతినిధ్యంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్ష మైనారిటీ ఓట్లు.. బలహీనపడుతున్న క్యాడర్: కరీంనగర్ గడ్డపై మైనారిటీ వర్గానికి చెందిన ఓట్లు దాదాపు లక్ష వరకు ఉన్నట్లు అంచనా....