కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు మరియు సిబ్బంది పనితీరును సమీక్షించారు. అలాగే పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడిన డీఐజీ.. ఆన్‌లైన్ వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచుగా నమోదయ్యే నేరాలు, గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతల తీరు తెన్నులు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా...