తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇప్పించండి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయిన ముఖ్యమంత్రి.. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు మంజూరయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజీతో భారీగా తగ్గనున్న విద్యుత్ వ్యయం: తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్ఆర్ఎల్ (FRL) +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా...