కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆమోదిస్తూ ప్రకటన విడుదల చేశారు. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ స్థానం: ఈ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలపనుంది. నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం: ఈ నియోజకవర్గం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ...