ప్రజాపాలన కాదు ఇది పూర్తిగా ప్రతీకార పాలన: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేత కొంకటి శేఖర్ తీవ్ర ఆగ్రహం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కార్యక్రమం ఉన్నందున, పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోయినపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామున 4 గంటలకే ముందస్తుగా అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ నేత కొంకటి శేఖర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో హిట్లర్ పాలనను మించిన ప్రతీకార పాలన సాగుతోందని విమర్శించారు. ప్రివెంటివ్ అరెస్టులతో భయానక వాతావరణం: ప్రతిపక్ష పార్టీల నాయకులను, ప్రజాస్వామ్య వాదులను ఎక్కడ నిలదీస్తారనే భయంతోనే పోలీసులు ముందస్తు (ప్రివెంటివ్) అరెస్టులకు పాల్పడుతున్నారని కొంకటి శేఖర్ ఆరోపించారు. ఇలాంటి భయస్తుడైన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల...