జాతీయ యోగా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించాలి రాష్ట్ర యోగ సంఘం కార్యదర్శి ఎన్. సిద్ధారెడ్డి
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్న 51వ జాతీయ స్థాయి జూనియర్స్ మరియు సబ్ జూనియర్స్ యోగా ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అధిక సంఖ్యలో పతకాలు సాధించాలని రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి ఆకాంక్షించారు. ఈనెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగే ఈ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు 40 మంది సభ్యులతో కూడిన తెలంగాణ జట్టు గురువారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి జైపూర్‌కు పయనమైంది. ఈ సందర్భంగా తెలంగాణ యోగ అసోసియేషన్ తరఫున క్రీడాకారులందరికీ, కోచ్‌లు, మేనేజర్లు మరియు రెఫరీలకు ట్రాక్ సూట్లను స్పాన్సర్ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే...