ప్రజారోగ్య సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ ఆవిష్కరించిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ కరీంనగర్ జిల్లాలో ప్రజారోగ్య సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈనెల అక్టోబర్ 6న నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్ను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు, వైద్యులు, నర్సులు మరియు ఇతర సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర వైద్యం 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు, వైద్య పరీక్షలు ప్రభుత్వ...