అర్హత ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్ అందించాలి..

కార్మికుల సమస్యలపై ఎస్ఓ టు జీఎంకు వినతి పత్రం అందజేసిన కర్నె బాబు. తెలంగాణ అడ్డా న్యూస్. భద్రాద్రి జిల్లా ప్రతినిధి. మణుగూరు సింగరేణి ఏరియాలో కార్మికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సామాజిక సేవకులు, కర్నే బాబురావు గురువారం సింగరేణి ఎస్ఓ టు జీఎం డి. వెంకట రామా రావుకి వినతిపత్రం అందజేశారు. రహదారిపైకి వాలిన చెట్ల కొమ్మలతో ఇబ్బందులు బొంబాయి కాలనీ నుంచి పీవీ కాలనీ లోని సింగరేణి సొసైటీ హైస్కూల్ వరకు రహదారికి ఇరువైపులా పెరిగి న చెట్ల కొమ్మలు రహదారిపైకి వాల డం వల్ల వాహనదారులు, సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.ముఖ్యంగా...