ఆలయ భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు.. సువీన్ యాదవ్‌కు ఘన సన్మానం

ఆలయ భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు.. సువీన్ యాదవ్‌కు ఘన సన్మానం తెలంగాణ అడ్డా బోయిన్పల్లి ప్రతినిధి ఆలయాల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బోయినిపల్లి మండల కేంద్రంలోని బీరప్ప స్వామి ఆలయం వద్ద సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్‌ను కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆలయ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల సంఘం సభ్యులు, గ్రామస్తులు సువీన్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ భద్రతకు ముందడుగు బీరప్ప స్వామి ఆలయంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇటీవల సువీన్ యాదవ్ తన సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను...