గాంధీ జయంతి వేడుకల్లో జర్నలిస్టుల నిరసన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేత
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్లోని పాత కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు శాంతియుతంగా నిరసన తెలిపారు. అనంతరం జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, పెద్ద రవీందర్, వెంకట్, గాండ్ల సంపత్, సహాయ కార్యదర్శి దాడి సంపత్ కుమార్, జన్నారం శ్రీనివాస్,...