సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఎన్‌ఈహెచ్‌ఎస్ (NEHS) ద్వారా చికిత్స అందేలా చూడాలి ఎమ్మెల్సీ శ్రీ పాల్‌రెడ్డికి టీఎస్‌జీఆర్‌ఈఏ కరీంనగర్ జిల్లా శాఖ వినతి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (TSGREA) కరీంనగర్ జిల్లా శాఖ భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పాల్‌రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు కొన్ని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ...