జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన కలెక్టర్ చిత్ర మిశ్రకు వినతిపత్రం అందజేత
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రను కలిసి, తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా...