తెలంగాణను వణికిస్తున్న వైరల్ ఫీవర్లు. క్రమంగా పెరుగుతున్న డెంగీ కేసులు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తుండటంతో పాటు డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,000కు పైగా డెంగీ కేసులు బయటపడ్డాయి. ప్రత్యేకించి హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు డెంగీ కారణంగా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరల్ ఫీవర్ల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం వస్తే వెంటనే సరైన వైద్య చికిత్స పొందాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 5 లక్షలకు పైగా జ్వర బాధితులు: ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో అధికారులు చేపట్టిన జ్వర సర్వేలో...