నేరెళ్ల బాధితులు అసలు బాధితులే కాదంటారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ: నేరెళ్ల బాధితులను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు బాధితులకు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేరెళ్ల బాధితులు అసలు బాధితులు అని చెప్పడానికి ఆధారాలే లేవని ప్రభుత్వం చెబుతున్న తీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ధ్వజమెత్తారు. హామీలు ఏమైపోయాయి?: అధికారంలోకి వస్తే నేరెళ్ల బాధితులకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, నేడు అధికారంలోకి రాగానే మాట మార్చడం దారుణమని విమర్శించారు. ఆనాడు పోలీసుల అణచివేతకు గురై...