రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎంటీవో కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని ఎంటీవో (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలను పరిశీలించిన ఆయన, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ​కార్యాలయ ఆవరణ, పోలీసు వాహనాల పార్కింగ్ ప్రాంతం, అలాగే సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది పూర్తి క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వ వాహనాల నిర్వహణ మరియు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ​కార్యాలయ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని...